వినుకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం..
న్యూస్ తెలుగు / వినుకొండ : మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల మూడవ శనివారం థీమ్– సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం వినుకొండ పట్టణంలోని ఏబీఎం కాంపౌండ్ 10 వ వార్డు నందు ప్రజలకు మూడు డబ్బాల వాడకం చెత్తను వేరు( తడి, పొడి మరియు గృహ సంబంధిత ప్రమాదకర) చేయుట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్. ఇస్మాయిల్ , వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇదే విధంగా పట్టణంలోని 32 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో సురేష్ మహల్ రోడ్ లో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. అదేవిధంగా శివయ్య స్తూపం సెంటర్ మరియు మార్కాపూర్ రోడ్ లోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద గల పబ్లిక్ టాయిలెట్స్ ను ఆధునీకరించి ప్రజలకు మంచి సదుపాయంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. (Story : వినుకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం..)