చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
న్యూస్‌తెలుగు/చింతూరు : ప్రతీ నెల మూడవ శనివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం, స్వచ్ఛతా కమిటీ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్నమాణిక్యం తెలియజేసారు.ఈ కార్యక్రమం లో కళాశాల జాతీయ సేవా విభాగ వాలంటీర్లు తో కలిసి విద్యార్థినీ విద్యార్థులు చింతూరు బస్టాండ్ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలిగించి బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేసారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ యం శేఖర్, జి. వెంకటరావు,ఆర్ చి హెచ్ నాగేశ్వరరావు,డాక్టర్ వై పద్మ, కె శకుంతల, జి. హారతి, యస్ అప్పనమ్మ, కె శైలజ, యం. నాగమోహన్ రావు,సి హెచ్ రాజబాబు, కె శ్రీలక్మి, యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.సాయికుమార్ , బి శ్రీనివాసరావు, నూనె రమేష్, వి. శీనయ్య, సుబ్బారావు, మంగయ్య, కన్నయ్య తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం)