జిల్లెల చిన్నారెడ్డి ని కలసిన బి.ఆర్.ఎస్ బృందం
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి చేసి సాధించిన బైపాస్ రోడ్డు,పాలిటెక్నిక్ దురస్థూ,వసతి గృహాల పునః నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బైపాస్ రోడ్ కోసం 73కోట్లు,పాలిటెక్నిక్ దురాస్తూ కోసం 22కోట్లు మంజూరు అయినాయని వాటిని వెంటనే ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాధించిన ఐ.టి టవర్ నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.
స్పందించిన చిన్నారెడ్డి ముమ్మాటికీ ఐ.టి.టవర్ మంజూరు నిరంజన్ రెడ్డి గారి కృషి అని భవిష్యత్తు తరాలకోసం నిలబెట్టడం జరిగిందని అన్నారు. బై పాస్ రోడ్డు మరియు పాలిటెక్నిక్ పునః నిర్మాణం నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బి.ఆర్.ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి,మాజీ కౌన్సిలర్ ఉంగ్లమ్. తిరుమల్,మండల యువత అధ్యక్షులు చిట్యాల.రాము,మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహేబ్ హుస్సేన్,వజ్రాల.రమేష్ ఉన్నారు.(Story : జిల్లెల చిన్నారెడ్డి ని కలసిన బి.ఆర్.ఎస్ బృందం)