మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అభినందనీయం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండ బాబు జగ్జీవన్ రావ్ కాలనీ నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ. మాదిగ ముద్దుబిడ్డ మంద కృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మంద కృష్ణ 30 సంవత్సరాలు యస్. సి . రిజర్వేషన్ కోసం పోరాట స్ఫూర్తిని గుర్తించి పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు. వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాదిగ బిడ్డలు అందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి. కోటేశ్వరరావు, వినుకొండ మండలం మాజీ ఎంపీపీ దారియేముల. సుబ్బయ, వినుకొండ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గర్నిపూడి ఈశ్వరయ్య , గుంజరి పున్నయ్య , కట్టెంపూడి బర్ణ, దొరట్ల. మన్నిబాబు , సంపంగిల, ప్రసద్,శ్రీరాములు రాంబాబు, సంపంగి పెద్ద నరసయ్య , పట్రా లింగయ్య, సంపంగిల శివ , దాసరి రాజేష్ తది తరులు పాల్గొన్నారు.(Story : మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అభినందనీయం )