జే.యన్.టి.యు గురజాడలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
విజయనగరం : జే.యన్.టి.యు.గురజాడ విశ్వ విద్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా యూనివర్సిటీ అకడమిక్ బ్లాక్ -1 నందు నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు చిత్ర పటానికి యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారత విభాగము అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి వైస్ – ఛాన్సలర్. ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మి మాట్లాడుతు ప్రతీ ఒక్కరు సరోజిని నాయుడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పాటు పడాలన్నారు. ప్రతీ ఒక్కరు వారి తల్లి చేసే ప్రోత్సాహాన్ని గుర్తించాలన్నారు. యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య జి.జయసుమ మాట్లాడుతూ, ప్రతీ మహిళ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, అక్కడ ఉన్నత శిఖరాలు చేరుకుంటారన్నారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, అకడమిక్ ఆడిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్. రాజేశ్వరరావు, మహిళా సాధికారత , ఫిర్యాదుల విభాగము కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. నళిని, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు . కళాశాల విద్యార్థినులు మహిళా వాలంటీర్లుగా చేరుటకు సుమారు 17 మంది విద్యార్ధినులు ముందుకు వచ్చి నందుకు వారిని విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ అభినందించారు.అనంతరo ఎన్ఎస్ఎస్ విభాగము అధ్వర్యంలో అకడమిక్ బ్లాక్ -2 సమీపంలో మామిడి మొక్కలను మొక్కలను నాటారు.అదే విధoగా గ్రీన్ క్లబ్ అధ్వర్యoలో పండిస్తున్న కూరగాయలు మొక్కలను యూనివర్సిటీ ఇంచార్జి వైస్ – ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇంచార్జి ప్రిన్సిపాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : జే.యన్.టి.యు గురజా )డలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
