మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ
భారీ ఎన్‌కౌంటర్: 31 మంది మావోయిస్టులు మృతి
ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు మృతి
మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం
జవాన్లను అభినందించిన ముఖ్యమంత్రి విష్టుదేవ్ సాయి,హోం మంత్రి శర్మ
న్యూస్‌తెలుగు/చింతూరు: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్‌లో తాజాగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఇది ఇప్పటివరకు అందిన సమాచారం మాత్రమే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బిజాపూర్ -నారాయణ్ పూర్ సరిహద్దుల్లో గల గ్రీన్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు సుమారు 100 మంది సమావేశం అయ్యారని తెలుసు కున్న సి ఆర్ పి యఫ్, బస్టర్ ఫైటర్స్, డి ఆర్ జి, సి ఆర్ పి యఫ్, సి 90 బలగాలు ఆదివారం ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొన్ని గంటలపాటు సాగిన ఈ కాల్పుల్లో తొలుత 12 మావోయిస్టులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సాయంత్రానికి మృతుల సంఖ్య 31 చేరుకుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నట్లు తెలిసింది. మావోయిస్టుల నుంచి ఆయుధాలు ఏ కె 47, యస్ యల్ ఆర్ లు, బర్మర్లు, మరికొన్నిఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది మావోయిస్టులకు గాయలైనట్లు సమాచారం. గాయలైన మావోయిస్టులు తప్పించు కున్నట్లు తెలిసింది. వారి కోసం గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టారు. మృతి చెందిన మావోయిస్టులలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక మావోయిస్టు నేతలు వున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల తో పాటు ఇద్దరు డి ఆర్ జి జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత బీజాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం విమానం లో మెరుగైన చికిత్స కోసం రాయపూర్ కు తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టులను నిర్మూలన కోసం ప్రత్యేకంగా నియమితులైన డి ఐ జి సుందర్ రాజ్ పట్వా ధృవీకరించారు. 2025లో ఇప్పటి వరకు 65 మంది మావోయిస్టులు ఎంకౌంటర్ లో మృతి చెందనట్లు పేర్కొన్నారు.
జవాన్లను అభినందించిన సీఎం
ఛత్తీస్‌గఢ్‌లో 31 మావోయిస్టులను మట్టుబెట్టిన డి ఆర్ జి జవాన్లను ముఖ్యమంత్రి విష్టుదేవ్ సాయి, హోం మంత్రి శర్మ అభినందనలు తెలిపారు. ఈ ఘటన లో ఇద్దరు జవాన్ లు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగం మరువలేనిదని, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా 2026 మార్చి 31వ తేది కి మావోయిస్టులు తుడుచి పెట్టుకుపోతారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. (Story: ఫ్లాష్ ఫ్లాష్: భారీ ఎన్‌కౌంటర్ః 31 మంది మావోయిస్టులు మృతి)
Follow the Stories:
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?