మారథాన్ పరుగులు పోటీలో వినుకొండ వీరుడు..
న్యూస్ తెలుగు / వినుకొండ : రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన “అళ్వార్ టైగర్ టెన్ కిలోమీటర్స్ మారథాన్” పరుగుల పోటీలో పాల్గొన్న మూడువేల మంది పోటీదారులలో ఏడవ స్థానం సాధించి మెడల్ పొందిన, వినుకొండ పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా. ఫిబ్రవరి 25న హిమాలయ ప్రాంతంలోని లడ్డాఖ్ లో మంచు మీద జరిగే గిన్నిస్ బుక్ పరుగుల పోటీలలో పాల్గొనే ప్రయత్నంలో, భారత దేశంలో పలు రాష్ట్రాలలో జరిగే పోటీలలో పాల్గొంటూ మెడల్స్ సాధించిన అబ్దుల్లా. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆర్థికంగా, మానసికంగా ,మనోధైర్యాన్ని అందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమద్ ,గుంటూరు ఈస్ట్ డి.ఎస్.పి జనాబ్ అజీజ్ భాయ్, డాక్టర్ సాయి కృష్ణ ప్రతిమా నర్సింగ్ హోమ్ గుంటూరు వారు, ఎండి కరీముల్లా, విశ్రాంత ఉద్యోగి షేక్అప్సర్ భాయ్, తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం, వారికి అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు. (sTORY : మారథాన్ పరుగులు పోటీలో వినుకొండ వీరుడు..)