కోల్డ్ స్టోరేజీల ద్వారా రైతుల ఆదాయం మెరుగు..
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : రైతులు పండించిన పంట ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీలలో నిలువ చేసుకొని పంట డిమాండ్, ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు విక్రయించుకుని ఆదాయం పొందవచ్చని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట నిలువలు ఉంచి రైతులకు ఓల్డ్ స్టోరేజ్ యజమానులు సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద చైతన్య ఓల్డ్ స్టోరేజిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు. (Story : కోల్డ్ స్టోరేజీల ద్వారా రైతుల ఆదాయం మెరుగు.. )