బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 97 వ నిత్యావసర వితరణ
న్యూస్ తెలుగు / వినుకొండ : బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్తా పక అధ్యక్షులు జి.వి మాధవరావు కార్యాలయం నందు ఆదివారం ఆర్థికంగా వెనుక బడిన బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకొనుట లో భాగంగా 06 కుటుంబబాలకు ,బియ్యం మరియు నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. ఈ నెల దాతలు చింతలచెర్వు రాఘవేంద్ర రావు, చింతలపూడి భద్రయ్య, పుట్టంరాజు, నారాయణం రామమోహనరావు, అప్పరాజు నాగేశ్వరావు,పొట్లూరి వరలక్ష్మమ్మ , ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు ల సహాయసహ కారములతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, భువనగిరి సుబ్రహ్మణ్యం,గాలి శ్రీనివాసరావు , యమ్.వి. శర్మ, యస్.యస్.వి. మల్లికార్జున శాస్త్రి, ధూళిపాళ్ళ నాగేశ్వరావు, ముటుకుల శివ
తదితరులు పాల్గొన్నారు. (Story : బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 97 వ నిత్యావసర వితరణ)