డిఏ లను వెంటనే ప్రకటించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : టీఎస్ యుటిఎఫ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డి ఎ లను వెంటనే ప్రకటించాలని టి ఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ రవి ప్రసాద్ గౌడ్, డి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క డీఎ ప్రకటించిందిని ,మిగతా పెండింగ్లో ఉన్న 5డిఏలను, పిఆర్ సి నివెంటనే ప్రకటించాలని కోరారు.సంవత్సరాలుగా తరబడి ఇ కుబెర్లలో పేరుకుపోయిన మెడికల్ రియంబర్స్మెంట్, పార్ట్ ఫైనల్ ,సరెండర్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనారోగ్య బాధ్యత ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కే.జ్యోతి,బి. వెంకటేష్ కోశాధికారి తిమ్మప్ప, కార్యదర్శులు హామీద్,పి. శ్రీనివాస్ గౌడ్ , అరుణ, జి.మురళి, జి.కృష్ణ టి.చెన్న కేశవులు తదితరులు పాల్గొన్నారు.(Story : డిఏ లను వెంటనే ప్రకటించాలి )