అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడు పై ఉంది
న్యూస్ తెలుగు /వినుకొండ : నేటి కాలంలో కళలు అంతరించి పోతున్నాయని, కళా కారులు దుర్బరమైన దారిద్ర్యలో మగ్గుతున్నారని, సినీ, టీవీల సంస్కృతి ప్రజలను కళారూపాలకు దూరం చేస్తున్నాయని, వినుకొండలో గుమ్మడి కళా పీఠం ద్వారా పూర్వ వైభవాన్న సంత రించుకుంటున్నాయని ప్రముఖ న్యాయవాది పి. సైదారావు కళా కారులనుద్దేశించి మాట్లాడారు. గుమ్మడి కళాపీఠం అధ్వర్యంలో ఆదివారం కళాకారుల ముఖ్య సమావేశం స్థానిక నరసరావుపేట రోడ్డులోని వెంకటేశ్వర
స్టూడియోలో జరిగింది. ముఖ్య అతిధులుగా ప్రముఖ న్యాయవాదులు పి. సైదారావు, ఎస్. కే.సిద్దయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం కళాకారులు లాయర్ సైదారావు ని ఘనంగా సత్కరించారు. (Story : అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడు పై ఉంది)