వేధింపులపై బగ్గుమన్న మెడికల్ కళాశాల పారిశుద్ధ్య కార్మికులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య సెక్యూరిటీ మహిళ కార్మికులను లైంగికంగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు రవికుమార్ భాస్కర్లను వెంటనే వీధుల నుండి తొలగించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు.శనివారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులపై వేదింపులు ఆపాలని, దొంగతనాల అసత్య ఆరోపణలను ఖండిస్తూ వనపర్తి ప్రభుత్వం మెడికల్ కళాశాల కార్మికులు నిరసనకు దిగారు.
ఈసందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:- చాలీ చాలని వేతనాలతో ఉద్యోగ భద్రతకు నోచుకోక పుట్టెడు బాదలతో పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికుల పట్ల పనికట్టుకొని కావాలని వక్రబుద్ధితో కార్మికులను వేధింపులకు గురిచేయడం బాధాకరమని అన్నారు. రవికుమార్ భాస్కర్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగులు మహిళా కార్మికుల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తిస్తు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తులు చేశారు. మన ఆగడాల రోజు రోజుకు మితిమీరి పోతున్నాయని అన్నారు. కార్మికులను మనుషులకు కూడా చూడకుండా హింసిస్తున్నారని అన్నారు. కార్మికులపై తప్పుడు ఆరోపణలు అసత్య నిందలు దొంగతనాలు మోపుతున్నారని ద్వజమెత్తారు. కార్మికులను కళాశాల అధికారులు అనధికారికంగా ఇళ్లల్లో కూడా పనిచేయిచుకుంటూ, సొంత పనులు చేయించుకోవడమే ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.జి ఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేనిచో కలెక్టర్ వైద్య శాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆందోళనలకు సిద్ధమవుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీహరి, కార్మికులు వరుణ్ బక్కయ్య షేకిల్ మద్దిలేటి మధు ఫారుక్ శ్రీరామ్ రాజశేఖర్ సాయిరాం, మన్నెమ్మ, సుజాత, సహీబాద్ బేగం,రాజేశ్వరి, శ్వేత, పుష్ప, రమ్య, రేణుక, చెన్నమ్మ, శోభ, లక్ష్మి, శోభ తదితరులు పాల్గొన్నారు. (Story : వేధింపులపై బగ్గుమన్న మెడికల్ కళాశాల పారిశుద్ధ్య కార్మికులు)