రియల్ ఎస్టేట్స్ రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
న్యూస్‌తెలుగు/వనపర్తి :గ్రామ కంఠం భూములను వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలి. 257 జీవోను రద్దు చేసి వెంటనే గ్రామపంచాయతీ లేఔట్స్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పార్టిషన్ డీడ్ అవడం లేదు వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అన్సార్ హుస్సేన్. బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అనేక కొత్త సమస్యలతో సమస్యల నిలయంగా తయారైంది. వివిధ జిల్లాల్లో గ్రామ కంఠం భూములను రిజిస్ట్రేషన్లు చేయక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీలో మున్సిపాలిటీల్లో ఓనర్ షిప్ సర్టిఫికెట్ కొరకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామ కంఠం భూములలో దాదాపు సంవత్సరాల తరబడుల నుంచి నివాసం ఉంటున్న వారి అన్నదమ్ములు భూములు పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమాకుర్చడం లో ప్రధాన పాత్ర పోషిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ గ్రామ పంచాయతీ లేఔట్స్ పై విధించిన ఆంక్షలా వల్ల ఎంతో ఆదాయాన్ని కోల్పోతుంది 257 జీవోను వెంటనే రద్దుచేసి గ్రామపంచాయతీలో మిగిలి ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు హెచ్ఎండిఏ మరియు డిటిసిపి వెంచర్లలో పార్టిషన్ డీడ్లు చేయకుండా కొంతమంది రిజిస్టర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి సమస్యలకు వలయంగా మారిన రిజిస్ట్రేషన్ శాఖలో త్వరలోనే మంచి నిర్ణయాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు సవ్యంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ఎంతోమంది నిరుద్యోగులు ఈ రంగంపై ఆశలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్స్ రంగo ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ సలహాదారులు అహమ్మద్ అలీ , కోర్ కమిటీ సభ్యులు భాను ప్రతాప్ . చికిరాల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు. (Story : రియల్ ఎస్టేట్స్ రంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం)