లారీ ఓనర్స్.. కార్మికులు సమస్యలు పరిష్కరించాలి
న్యూస్ తెలుగు/సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్, డీజిల్ రేట్లు తగ్గించి లారీ మోటార్ పరిశ్రమను ఆదుకోవాలని సాలూరు లారీ యజమానుల సంఘం నాయకులు గులమజ్జి లక్ష్మణరావు (చిన్న )అన్నారు శనివారం ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్షోభంలో మోటార్ లారీ పరిశ్రమ ఉందని అన్నారు. కార్మికులు ఆవేదన లారీ ట్రాన్స్ పోర్ట్ యజమానులు బాధతో గ్రీన్ టాక్స్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండటం వలన చాలా ఇబ్బందులకు గురువుతున్నారని అన్నారు.రాష్ట్రంలో విజయవాడ తర్వాత సాలూరు మోటారు లారీ పరిశ్రమ అతి పెద్దదిగా ఉందని దీనిపై వందలాదిమంది లారీ యజమానులతో వేలాది కార్మికులతో ఉపాధి పొందుతున్నారని అన్నారు. నేడు ఈ పరిశ్రమ దినస్థితిలోకి వెళ్ళిపోయిందని ఆవేదన చెందుతున్నారని అన్నారు.లారీ మోటారు పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, డీజిల్ ధరలు, రోడ్డు టాక్సీ, గ్రీన్ టాక్సీ అలాగే స్పేర్ పార్ట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. దీంతో లారీ యజమానులు అయిన మేము అప్పులు ఊబిలోకి కూరుకు పోయామన్నారు. అంతేకాకుండా మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాల్లో డీజిల్ అలాగే గ్రీన్ టాక్స్ లు తక్కువ ఉంటాయని స్పష్టం చేశారు.దీనితో లారీ ఓనర్స్ చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని లారీ ఓనర్స్,కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.అలాగే లారీ యజమానులను ప్రభుత్వలు ఆదుకోవాలని రాష్ట్ర రిపబ్లిక్ ఇన్ పార్టీ కార్యదర్శి గొంప.ప్రకాశరావు కోరారు. (Story : లారీ ఓనర్స్.. కార్మికులు సమస్యలు పరిష్కరించాలి)