శ్రీనివాస నగర్ ఆలయంలో సామూహిక వ్రతాలు
న్యూస్ తెలుగు/వినుకొండ: మాఘమాసం సందర్భంగా శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత, సామూహిక శ్రీ వేంకటేశ్వర స్వామి వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ మాసంలో భగవత్ సన్నిధిలో, మంగళ వాయిద్యాల మధ్య ఈ వ్రతం ఆచరించడం ద్వారా భగవత్ అనుగ్రహం కలిగి, భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు, కార్యక్రమ వశిష్టులు శ్రీనివాస శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆలయాలు మన సంస్కృతి నిలయాలని, సమాజ సంస్కార కేంద్రాలుగా వెలసిల్లేవని.. కార్యక్రమంలో ఆదాయ వనరులుగా తయారు చేస్తున్నారని., ఇటీవలి హైందవ శంఖారావం స్ఫూర్తిగా తిరిగి సామాన్య భక్తునికి ఆలయంలో ఆధ్యాత్మిక ఆనందం, భగవంతుని ఆశీస్సులు లభించే విధంగా.. భక్తుల నుండి ఎట్టి రుసుము వసూలు చేయకుండా విశ్వహిందూ పరిషత్ ఈ ఉచిత సామూహిక వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి 65 కలశాలతో దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున స్పందించటం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ భాగవతుల రవికుమార్ చెప్పారు. భవిష్యత్తులో ప్రతినెల ఒకరోజు లేదా తరచుగా ఈ కార్యక్రమాలు నిర్వహించ సంకల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు భాగవతుల రవికుమార్, అర్చక పూర్వహితులు శ్రవణ్ కుమార్, వడ్డెంగుంట శేఖర్, ఆలయ కమిటీ సభ్యులు.. బంగారయ్య, కాళ్ల కోటేశ్వరరావు, అచ్యుత కృష్ణ, వాసు, పరిషత్ కార్యకర్తలు గోనుగుంట్ల గంటారావు, కొలిశెట్టి సుబ్బారావు, పువ్వాడ అరవింద్, కోటేశ్వరరావు అప్పల రాజా, నాగలక్ష్మి, సురేఖ, సత్సంగ సభ్యులు, సేవాదళ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. (Story: శ్రీనివాస నగర్ ఆలయంలో సామూహిక వ్రతాలు)