ఖాజ కుత్బుద్ధిన్ సేవలు చిరస్మరణీయం
న్యూస్‌తెలుగు/వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా వ్యవస్థాపకులు మాజీ చైర్మన్ స్వర్గీయ ఖాజ కుత్బుద్ధిన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ మరియు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు రీజినల్ మెడికల్ ఆఫీసర్ శివ ప్రసాద్, స్వర్గీయ ఖాజ కుత్బుద్ధిన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ డాక్టర్ ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ ఖాజ కుత్బుద్ధిన్ గారి సేవలు ప్రశంసనీయం అని వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వనపర్తి జిల్లా ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆర్.ఏం.ఓ డాక్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో రక్తదాన శిబిరాలతో పాటు అవసరం ఉన్న వారికి ఆక్సిజన్ కాంసెంట్రేటర్లు సమకూర్చి ఎంతో మందికి స్వస్థత చెలురేందుకు సహకరించారని అన్నారు. వారి ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని రక్తదానం చేసిన రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్. రాజేందర్ కుమార్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఎస్.కే ముహమ్మద్, వహీద్ రెడ్ క్రాస్ సిబ్బంది వసీం, గోవిందు ఏం. డి పాషను ప్రత్యేకంగా అభినందించారు. ఖాజ కుత్బుద్ధిన్ గారికి వారి అభిమానులుగా గొప్ప నివాళి ఈ రక్తదాన శిబిరం అని వారి ఆశయాలు నెరవేర్చడానికి ఎల్లప్పుడూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఏం హెడ్ ఓ మరియు రెడ్ క్రాస్ వనపర్తి జిల్లా చైర్మన్ డాక్టర్ జె.శ్రీనివాసులు, ఆస్పత్రి ఆర్.ఏం.ఓ శివ ప్రసాద్, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ ఎం. డి అమర్, కలామ్ పాష, జిల్లా కోఆర్డినేటర్ ఆర్. రాజేందర్ కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు వసీం, గోవిందు, పాష, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మెహ్మూద్, వహీద్, తిరుపతయ్య, లక్ష్మీ పతి, కార్తీక్, జే. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. (Story: ఖాజ కుత్బుద్ధిన్ సేవలు చిరస్మరణీయం)