అప్పుల్లో చంద్రబాబు సరికొత్త రికార్డ్
సూపర్ సిక్సూ లేదూ..సెవెనూ లేదూ..!
తొమ్మిది నెలల్లో ప్రజలకు దగా
ఇది ఆర్థిక విధ్వంసం కాదా?
ఉద్యోగులకు మొండిచేయి
ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే..అసెంబ్లీకి వేళ్లేదేలేదు..
పార్టీని ఎవరు వీడినా..వారికే నష్టం
నా బలం..దేవుడి దయ..ప్రజలే
విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
న్యూస్ తెలుగు/అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ ఈ తొమ్మిది నెలల పాలనలో సూపర్ సిక్స్ లేదు..సెవ్‌నూ లేదు..మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ పాయే…అంటూ మాజీ సీఎం, వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని, 9 నెలల్లోనే రూ.80 వేల కోట్లు అప్పు తెచ్చిందని, అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52 వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. మొత్తంగా తెచ్చిన, తేవబోయే అప్పులు కలసి లక్షా 45వేల కోట్లకు చేరాయని, ఇంత అప్పులు చేసినా ప్రజలకేమీ సంక్షేమం అందించలేదని, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయలేదని జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ను, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ను నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని, చంద్రబాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంట్ణీ అని ప్రచారం చేశారనీ, 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జగన్ విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా?, ఆరోజు చంద్రబాబు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. సూపర్ సిక్స్ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, నీకు రూ.15 వేలు,. నీకు రూ.15 వేల్ణు అంటూ ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని, ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయని జగన్ నిలదీశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ప్రస్తుతం చేసిన, చోయబోతున్న అప్పులు రూ.1.45 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని జగన్ ధ్వజమెత్తారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ ఇచ్చారా?.. అని ప్రశ్నించారు. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదుగానీ, ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ధ్వజమెత్తారు.
ఇది విధ్వంసం కాదా?,
బడికెళ్లే పిల్లలకు ఇస్తామన్న తల్లికి వందనం నిలిపేశారు?, ఇది విధ్వంసం కాదా? అని జగన్ ధ్వజమెత్తారు. పాఠశాలల్లో నాడు`నేడు పనుల్ని నిలిపివేశారని, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్ తరగతులు నిలిపి పిల్లలకు ప్రంపంచ స్థాయి విద్యను దూరం చేశారు?.. ఇది విధ్వంసం కాదా.?, ఎనిమిదో తరగతి చదివే పిల్లల నుంచి ప్రతేటా ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేశారు.., సబ్జెక్టు టీచర్లకు గ్రహణం పట్టించారు..ఇవి విధ్వంసం కాదా? అని ప్రశ్నించారు. వసతి దీవెన పథకం పూర్తిగా రద్దుచేసి, విద్యాదీవెన అరకొరగా ఇస్తూ, పిల్లల చదువులు, వారి జీవితాలతో చెలగాటమాడటం విధ్వంసం కాదా? అని మండిపడ్డారు. చంద్రబాబు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకపోగా, ఉన్న పథకాలను ఎత్తేశారు..ఇది విధ్వంసం కాదా? అని నిలదీశారు. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచి పేద ప్రజలతో ఆటలాడుకుంటున్నారని, రైతు భరోసా నిలిపేసి రైతుల జీవితాలతో చెలగాటం చేయడం విధ్వంసం కాదా?, అని ప్రశ్నించారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఇది విధ్వంసం కాదా? అని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా?, ప్రశ్నిస్తే దాడులు చేయడం విధ్వంసం కాదా? అని జగన్ అన్నారు.
ఉద్యోగుల మూడు డీఏలు ఏవీ ?
ప్రభుత్వ ఉద్యోగుల మూడు డీఏలు ఇంకా పెండిరగ్‌లోనే ఉన్నాయని, ఉద్యోగుల సమస్యలు ఎక్కడ పరిష్కారమయ్యాయని చంద్రబాబును జగన్ నిలదీశారు. ఉన్న పీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్సీ చైర్మన్‌ను తొమ్మిది నెలలుగా ఎందుకు వేయలేదన్నారు. జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా చంద్రబాబు వాడేసుకున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టులను నిర్మించామన్నారు.
అసెంబ్లీకి వెళ్తే ఈ తరహాగా నాకు సమగ్రంగా వివరించే సమయం అక్కడ ఇవ్వకూడదనే ప్రతిపక్ష హోదాను దూరం చేశారని జగన్ చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే…అసెంబ్లీకి వెళ్లబోనని జగన్ పునరుధ్ఘాటించారు…
అందుకే ప్రజలకు నేను చెప్పాల్సిందీ..మీడియా రూపంలో చెబుతున్నానన్నారు. ఒక వైపు అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, దీనిపై చర్చిస్తే..తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుందనే మౌనంగా ఉన్నారన్నారు. మీరు అసెంబ్లీకి వెళ్లకపోతే అనర్హతవేటు వేసే అవకాశముందని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ…ఏమైనా చేసుకోమనండి..అందుకు నేను సిద్ధమంటూ బదులిచ్చారు.రాజ్యసభ సభ్యులు మరికొందరు పార్టీని వీడుతున్నారనే దానిపై జగన్ స్పందిస్తూ బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి ఎవరైనా వెళ్లినా వారికి విశ్వసనీయత ఉండబోదన్నారు. తన బలం దేవుడి దయం, ప్రజలేనని జగన్ పునరుద్ఘాటించారు. (Story: సూపర్ సిక్సూ లేదూ..సెవెనూ లేదూ..!)