బీసీల జనాభా లెక్కను పునః సమీక్షించాలి: రమేష్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రభుత్వం సేకరించిన బీసీ జనాభా లెక్కల పై పార్టీలు ప్రజా సంఘాల అనుమానాల దృష్ట్యా పున సమీక్షించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి ఆఫీసులో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వే లో బీసీల జనాభా ఒక కోటి 85 లక్షలు ఉండగా, 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో కోటి అరవై నాలుగు లక్షలు గా తేలిందన్నారు. బీసీ జనాభా 21 లక్షలు తగ్గినట్లు తేలిందన్నారు. 10 ఏళ్లలో జనసంఖ్య పెరిగాలే తప్ప తగ్గే అవకాశం లేదన్నారు. అంతేగాక హైదరాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో 50 శాతం మంది సర్వే సిబ్బందికి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు అన్నారు. వారి లెక్కలను కూడా సేకరించాలన్నారు. ప్రస్తుతం సేకరించిన జనాభా ప్రకారం బీసీలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తే, తప్పు లెక్కల వల్ల బీసీలకు నష్టం జరుగుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పిస్తామన్నారని, చట్టబద్ధత కల్పించాలంటేఅసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆమోదం పొందాలన్నారు. అలాంటి తీర్మానం ఏది అసెంబ్లీలో చేయలేదన్నారు. దీనివల్ల 42 శాతానికి చట్టబద్ధతపై సందేహాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం సేకరించిన బీసీ జనాభా ఆధారంగా బీసీ యాక్షన్ ప్లాన్ తెస్తారా, బీసీలకు ఆ మేరకు నిధులు కేటాయిస్తారా అన్నది ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పలేదన్నారు. ఆసరా పింఛన్ కోసం పెట్టుకున్న అర్జీలు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించాలన్నారు. ఏడాదికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టిందన్నారు. గత ప్రస్తుత సంవత్సరాలకు కలిపి 7000 నియోజకవర్గానికి ఇవ్వాలన్నారు. వారం రోజుల్లో రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ నాయకులు గోపాలకృష్ణ, చిన్న కుర్మయ్య, శాంతన్న తదితరులు పాల్గొన్నారు. (Story : బీసీల జనాభా లెక్కను పునః సమీక్షించాలి: రమేష్)