మొక్కలు నాటాలి.. ప్రకృతిని కాపాడాలి..
జమాల్ ఖాన్
న్యూస్‌తెలుగు/చింతూరు ; ప్రతి ఒక్కరూ విధిగా పచ్చని మొక్క నాటి ప్రాణాలు కాపాడే ప్రకృతిని పెంచాలని, మానవాళికి ప్రాణవాయువు అందించే యంత్రం ఏమీ లేదు ప్రకృతి తంత్రమే ఉపయోగపడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యుత్ కార్యాలయ ప్రాంగణము, ఏ జి హెచ్ సి బాలికల హాస్టల్, భాస్కర్ విద్యానికేతన్ పలు విద్యా ప్రభుత్వ కార్యాలయంలో ఆయన మొక్కలను స్వయంగా నాటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి మొక్కలే నాటి మహా వృక్షాలుగా మన భావితరాలకు ప్రాణ వాయువు ఇచ్చే సాధనాలుగా ఉపయోగపడతాయని, గ్లోబలైజేషన్ కారణంగా భూతాపం రోజురోజుకు పెరిగిపోయి పరిశ్రమల విషవాయువుల వలయంలో చిక్కుకొని కలుషిత వాతావరణ కోరల్లో మానవ జీవితం లో వాటి నుండి కాపాడే ఏకైక శక్తి పచ్చని ప్రకృతి ఒడిలో పెరిగే వృక్షాలు మాత్రమే మనకు రక్షించగలుగుతాయని వాటిని కాపాడే బాధ్యత మనందరిపై ఎంతో ఉందని ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి నీరు పోసి పెంచాలని ఆయన మొక్కలు వాటి యొక్క విశిష్టతను విద్యార్థులకు విడమర్చి చెప్పడమైనది. సుమారుగా 400మొక్కలను మండలంలో స్వయంగా తమ సిబ్బందితో వెళ్లి నాటినారు. భాస్కర్ విద్యానికేతన్ బోధన సిబ్బంది జమాల్ ఖాన్ ను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు, ఏ జి హెచ్ ఎస్ పావని, విద్యుత్ సిబ్బంది గణేష్, రమణ, జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు ఎస్ కె రియాజ్, షాజహాన్, నటరాజ్, పొదిలి రామారావు, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.(Story : మొక్కలు నాటాలి.. ప్రకృతిని కాపాడాలి..)