మిడిల్ క్లాస్ బడ్జెట్
– ₹12 లక్షలవరకు నో ట్యాక్స్
న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారాం మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండేలా 12 లక్షల ఎటా ఆదాయానికి టాక్స్
మినహాయింపు ఇచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న సందర్భంగా నిరుపేద, మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించి ఆదాయపు పన్నుపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. తాజా ప్రకటనతో పేద, మధ్య తరగతి ప్రజలకు పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా కానున్నాయి.
ఇక రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల లోపు ఆదాయం ఉంటే 25 శాతం, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు వారికి 20 శాతం, రూ.12 లక్షల నుంచి 16 లక్షల లోపు వారికి 15 శాతం పన్ను విధించనున్నట్లుగా కొత్త శ్లాబులను ప్రకటించారు. త్వరలోనే రాబోయే ఇన్‌కం ట్యాక్స్ బిల్లు కూడా లిటిగేషన్లు తగ్గించేలా ఉంటుందని అన్నారు. BNS స్ఫూర్తితో ఆదాయపు శాఖ పన్ను ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్మాల్ ట్యాక్స్ పేయర్స్‌కు టీడీఎస్ లేదని తెలిపారు. వచ్చే వారం కొత్త వ్యక్తిగత ఇన్‌కం ట్యాక్స్ బిల్లును ప్రవేశ పెట్టబోతున్నామని వెల్లడించారు. అయితే, బిల్లు గురించి ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని, వచ్చే వారం ప్రత్యేకంగా బిల్లు సభ ముందుకు తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా భీమా రంగంలో వంద శాతం ఎఫ్డీఐకి ఆమోదం తెలిపామని అన్నారు. కాగా, ఇన్‌కం టాక్స్‌లో ఉన్న అనవసరపు సెక్షన్లను మోడీ సర్కార్ తొలగించనుంది.(Story : మిడిల్ క్లాస్ బడ్జెట్)