Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

0

 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ ప్రజాదర్బార్ లో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, పీవీ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.(Story :  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version