కవి కరీముల్లా కు అవార్డు
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండకు చెందిన ప్రముఖ కవి కరీముల్లా కవిత్వం ఆంగ్లంలో అనువదింపబడి పుస్తకంగా వెలువడింది. కర్ణాటక కు చెందిన ప్రముఖ ఆంగ్ల కవి రామలింగ గౌడ “.ఏ ప్లాక్ అఫ్ తినీ బర్డ్స్ “పేరుతో అనువదించారు. కరీముల్లా కవిత్వం సామాజిక చైతన్యం పెంపొందించే సాధనంగా భావించి అంతర్జాతీయంగా పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ పుస్తకం వెలువరించినట్టు రామలింగెగౌడ తెలిపారని కరీముల్లా చెప్పారు..ఇప్పటికే కరీముల్లా కవిత్వం పలు భాషల్లో వెలువడి అంతర్జాతీయ కవిగా గుర్తింపు పొందటం వినుకొండ ప్రాంతానికే గర్వకారణంగా భావిస్తున్నట్టు పలువురు కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. వీరిలో ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్, న్యాయవాది సిద్ధయ్య, సంగీతరావు, కేశవసూరి, గుడిపూడి గోవిందు, నాగేంద్రుడు మాస్టారు, డి.మస్తాన్ తదితరులు ఉన్నారు. (Story : కవి కరీముల్లా కు అవార్డు)