చత్తీస్గడ్లో లొంగిపోయిన పదిమంది మావోయిస్టులు
న్యూస్‌తెలుగు/చింతూరు : బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట పదిమంది మావోయిస్టులు శుక్రవారం లొంగి పోయారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల భావజాలం పట్ల విరక్తి కలిగి, భ్రమలు తొలగి, సంస్థలో పెరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా ఆరు లక్షల రివార్డు జరిగిన ఐదుగురు మావోయిస్టులు, మరో ఐదుగురు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బీజాపూర్ జిల్లాకు చెందిన డివిజన్ పార్టీ సభ్యులు, సిఎన్ఎం సభ్యులు, పి ఎల్ జి ఏ సభ్యులు, జనసేన సర్కార్ సభ్యులు, కుటీర్ శాఖ, వ్యవసాయ శాఖ అధ్యక్షులు ఉన్నారు, బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభావితులై మావోయిస్టులకు దూరమై, చేరారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో పాలగు డా జనసేన సర్కార్ తాటి హద్మ(38), మడివి హుంగా(42)మడివి భీమ (34)మడకం నంద (43),భీమా హేమ (25) పాలగూడ కు చెందినమడకం భీమా (26) ఎర్ర పల్లికి చెందిన సర్వ హ ద్మ(30) మడివి దూల (25) గోమా బిట్టు(28) వీరందరికీ తాత్కాలిక సాయం కింద 25 వేల నగదు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కలిగిస్తారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ నెలలో 46 మంది అరెస్టు కాగా,17మంది ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.(Story : చత్తీస్గడ్లో లొంగిపోయిన పదిమంది మావోయిస్టులు)