Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మావోయిస్టు కమిటీలో భారీ మార్పులు

మావోయిస్టు కమిటీలో భారీ మార్పులు

0

మావోయిస్టు కమిటీలో భారీ మార్పులు

హిద్మా, అతని బెటాలియన్ నెంబర్ తొలగింపు

ఝార్ఖండ్ కు చెందిన

పతిరామ్ మాఝికి

కేంద్ర కమిటీలో చోటు

న్యూస్‌తెలుగు/చింతూరు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ లో మావోయిస్టుల నిరంతర వైఫల్యం, ఎన్కౌంటర్లలో చనిపోయే మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర కమిటీ లో మార్పులు వచ్చాయి.కొన్ని నెలల క్రితం మావోయిస్టు మిలిటరీ బేటాలియన్ నెంబర్ 1 చీఫ్ మడివి హిద్మ ను సెంట్రల్ కమిటీలో చేర్చారనే వార్తల మధ్య, ప్రస్తుతం హిద్మ స్థానంలో జార్ఖండ్ భయంకరమైన మావోయిస్టు పతి రామ్ మాఝి ని సెంట్రల్ కమిటీలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత 13 నెలల్లో భస్థర్ డివిజన్లోని వివిధ జిల్లాలో 225 కోట్ల రూపాయలకు పైగా రివార్డులు తీసుకు వస్తున్న మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చటం గమనార్హం. మావోయిస్టుల ప్రధాన ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోయి మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేసి, వారిని ఎన్కౌంటర్ చేయడం భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. నిరంతరం గాలింపు చర్యల మూలంగా మావోయిస్టుల మూలాలు బలహీన పడటం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీలో మార్పు వచ్చిందని వార్తలు వచ్చాయి. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా 2026 మార్చి డెడ్ లైన్ గా నిర్ణయించారు. భద్రత బలగాలు కూడా ఈ సమయ పరిమితి ప్రకారం తమ పనని కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాల చేస్తున్న ఎన్కౌంటర్ల ఫలితంగా చిన్న పెద్ద తేడా లేకుండా నిరంతరం హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు..

ప్రస్తుతం బస్తర్ లో భద్రత బలగాలు మావోయిస్టులపై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో చర్యలు తీసుకుంటూ విజయం సాధిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మావోయిస్టు సంస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నప్పటికీ , అన్ని వ్యూహాలు విఫలమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి ప్రకటన తర్వాత బస్టర్ లో బస్తరు మావోయిస్టుల ఉగ్రవాదం నుండి త్వరలో విముక్తి పొందనుందని పేర్కొన్నారు. నిరంతరం జరిగే ఎన్కౌంటర్ల తో నిరంతర వైఫల్యాల మధ్య మావోయిస్టు సంస్థ తమ క్యాడర్ నైతిక సైర్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో, పూజారి కాంకేర్ – తుమ్రేల్ లో 6 మంది పోలీసుల సిబ్బందిని బలిగొన్న దిగ్భ్రాంతి కరమైన వార్తను ఇటీవల విడుదల చేసింది. (Story : మావోయిస్టు కమిటీలో భారీ మార్పులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version