గద్దర్ గొప్ప కళాకారుడు
న్యూస్ తెలుగు/వనపర్తి : సామాజిక అసమానతలు, తెలంగాణ సాధన కొరకు గళమెత్తిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ గొప్ప కళాకారుడని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం అన్నారు. జనవరి, 31 శుక్రవారం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా సాంస్కృతిక కళాకారులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి గద్దర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సాంస్కృతిక కళాకారుల ఆట పాటలతో ఉదయం నుండి గద్దర్ స్వయంగా పాడిన పాటలు, ఆయన పై కళాకారులు రచించిన పాటలు పాడుతూ ప్రజల్లో గద్దర్ యొక్క జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు సతీష్, గంధం నాగరాజ్, చీర్ల చందర్, జిల్లా సాంస్కృతిక శాఖ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.(Story : గద్దర్ గొప్ప కళాకారుడు )