ఈదమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/పెబ్బేరు : కొల్లాపూర్ ప్రజల ఆరాధ్య దైవం,ఆదిపరాశక్తి ఈదమ్మ తల్లి దేవత పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలో ఈదమ్మ తల్లి గుడి పున నిర్మాణం,విగ్రహాల పునః ప్రతిష్ఠ అత్యంత వైభవంగా తన సొంత ఖర్చులతో నిర్వహించిన మాజీ ఎం.ఎల్.ఏ బీరం.విజయమ్మ హర్షవర్ధన్ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ ఆలయ పునః ప్రతిష్ఠకు అహర్నిశలు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.మాజీ ఎం.ఎల్.ఏ బీరం.హర్షవర్ధన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ఈదమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి )