బండలాగుడు పోటీలతో పండగ వాతావరణం
న్యూస్ తెలుగు/పెబ్బేరు : బండలాగుడు పోటీలతో పండగ వాతావరణం నెలకొని ఉంటుందని సాంస్కృతి సాంప్రదాయాలకు ఈ బండలాగుడు పోటీలు చిహ్నాలుగా నిలుస్తాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారుపెబ్బేరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీల కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరై సీనియర్ విభాగానికి సంబంధించిన పోటీలను ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బండలాగుడు పోటీలతో వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు పట్టణ ప్రాముఖ్యత నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఈ పోటీలు నిర్వహించిన రైతు సంఘం నిర్వాహకులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు
పోటీలను ప్రారంభించిన ఆయన తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అంతర్రాష్ట్ర బండలాగు పోటీలలో పెబ్బేరు పట్టణానికి కూడా స్థానం ఉండేలా చూడాలని చూడాలని ఆయన కోరారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పసుపు పోషకులు, నిర్వాహకులు రైతు సంఘం నాయకులు మండల పరిధిలో గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : బండలాగుడు పోటీలతో పండగ వాతావరణం )