అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
న్యూస్ తెలుగు/వినుకొండ : చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ముందుగా రిపబ్లిక్ డే నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కమిషనర్ గా అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ ను దుశ్యాలువా పూలమాలతో సత్కరించి చైతన్య స్రవంతి సభ్యులు మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. తెల్లవారుజామునే వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, అందుకు గుర్తింపుగా చైతన్య స్రవంతి సేవా సంస్థ దుప్పట్లు అందజేయడం అభినందనీయమని అన్నారు. సన్మాన గ్రహీత మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. అందరి సహకారంతోనే నాకు ఈ అవార్డు వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ సామాన్యమైన చిరుఉద్యోగి గత రెండు దశాబ్దాలుగా చైతన్య స్రవంతి, గుమ్మడి వృద్ధాశ్రమం, గుమ్మడి కళా పీఠం నడుపుతూ 7వేల కార్యక్రమాలు చేయటం తనను విస్మయానికి గురి చేస్తుందని భవిష్యత్తులో వీరికి, వీరి సంస్థలకు అండగా ఉంటానని తెలిపారు. తెలుగు గొప్పదనం గురించి పద్యం రూపంలో పాడిన పౌరాణిక రంగస్థల కళాకారుడు రామాపురం వెంకటేశ్వర్లు ను చప్పట్లతో అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్రవంతి వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, అందరివాడు సద్దాం, రంగస్థల కళాకారులు రామపురం వెంకటేశ్వర్లు, ఏ.ఈ ఆదినారాయణ, సానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ జీవనజ్యోతి స్వచ్ఛంద సంస్థ మంద వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.(Story : అవార్డు గ్రహీతకు ఘన సన్మానం )