నారాయణపూర్ లో 29 మంది లొంగి పోయిన మావోయిస్టులు
న్యూస్‌తెలుగు/చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో నిర్వహిస్తున్న “సేవ్ మాడ్ ప్రచారం” అనే లొంగుబాటు విధానం కింద చారిత్రాత్మక విజయం. కుతుల్ ఏరియా కమిటీకి చెందిన 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు మరియు 07 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి చేరాలని, స్వేచ్ఛగా సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులలో జనతాన సర్కార్, మిలిషియా, సి యన్ యం , వ్యవసాయ సభ్యులు, పంచాయతీ ప్రభుత్వ అధ్యక్షుడు/సభ్యులు ఉన్నారు. 2024 నుండి జిల్లాలో పని చేస్తున్న 71 మందికి పైగా పెద్ద, చిన్న కేడర్ మావోయిస్టులు లొంగిపోయారు. (Story : నారాయణపూర్ లో 29 మంది లొంగి పోయిన మావోయిస్టులు)