మావోయిస్టు కీలక నేత చందన్ మిశ్రా అరెస్ట్
న్యూస్‌తెలుగు/చింతూరు : మావోయిస్ట్ జిల్లా నాయకుడు చందన్ మిశ్రా ను చింతూరు పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తెలంగాణ రాష్టం హైద్రాబాద్ కి చెందిన చందన్ మిశ్రా అలియాస్ నగేష్ 2018 సంవత్సరానికి ముందు మావోయిస్టు పార్టీ కి ఆకర్షితుడై మావోయిస్టు పార్టీ లో చేరాడు.మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే వాడు. అలా పని చేస్తూ అంచేలా వారీగా జిల్లా నాయకుడు గా ఎదిగాడు. ఈ దశలో 2018 లో ఎటపాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి రిమాండ్ కు తరలించారు. జైలుకు వెళ్లి వచ్చిన తన తీరు మార్చుకోకుండా మరల మావోయిస్టు కార్య కలపాలలో పాల్గొంటూ ఆంధ్ర చతిస్గడ్ పరిధిలోని దండకారణ్యంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అజ్ఞాతం లో ఉన్నట్లు తెలిసింది.గత ఏడాది చింతూరు మండలం లోని మల్లం పేట అటవీ ప్రాంతం లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందు పాత్ర అమర్చిన ఘటన లో చందన్ మిశ్రా నిందితుడు గా ఉండటం తో అతని పై చింతూరు పోలీస్ లు నిఘా పెట్టారు.ఈ క్రమంలో ఈ నెల 25 వ తేదీన చింతూరు లో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి నట్లు యస్ ఐ రమేష్ తెలిపారు. (Story : మావోయిస్టు కీలక నేత చందన్ మిశ్రా అరెస్ట్)