విద్యార్థికి మృతికి కారణమైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాలపేట మండల కేంద్రంలో ఎస్సీ హాస్టల్ నందు ఏదుట్ల గ్రామానికి చెందిన భరత్ అనే విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ ను సస్పెండ్ చేసి తక్షణమే అరెస్టు చేయాలని. డిమాండ్ చేస్తూ ఎంసిఎచ్ హాస్పిటల్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు పిడిఎస్యు టిఆర్ఎస్వి యువజన సంఘం డివైఎఫ్ఐ మహిళా సంఘం ఐద్వా కెవిపిఎస్ ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థి మృతి కి కారణమైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యత కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని. డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరాగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు పర్యవేక్షించాలని పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావతం అవుతున్నాయని వారు విమర్శించారు. ఆర్డీవో సంఘటన స్థలానికి వచ్చి హామీ మేరకు రాస్తారోకో ను విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపాలకృష్ణ.రమేష్.గణేష్. పవన్. ఆది. చంద్రశేఖర్ భగత్. మహేష్ కవిత రేణుక. బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యార్థికి మృతికి కారణమైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి )(