జర్నలిస్టుల సమస్యల పరిష్కరిస్తాం
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన సమావేశం వినుకొండ జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పారెళ్ళ రమేష్ అద్యక్షతన జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని మాట్లాడుతూ. వినుకొండలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. జర్నలిస్టులు యూనియన్ కు అండగా మేముంటామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. వినుకొండ పట్టణం లో జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని అభినందించి దుశ్యాలువలతో సత్కరించారు.(Story : జర్నలిస్టుల సమస్యల పరిష్కరిస్తాం )