ప్రతి సంవత్సరం ఆటలను,క్రీడాకారులను పెంచుకునే దిశగా కృషిచేస్తున్న నిర్వాహకులకు అభినందనలు
P.P.L( పెబ్బేరు ప్రీమియర్ లీగ్)ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : చౌడేశ్వరి జాతర సందర్భంగా పట్టణ స్టేడియంలో నిర్వహిస్తున్న పి.పి.ఎల్.క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు పాల్గొని రిషి రైడర్స్ మరియు మన్నెం రైడర్స్ మధ్య జరిగే క్రికెట్ తను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. గత 16సంవత్సరాలుగా హనుమాన్ యూత్,ఆజాద్ యూత్ ఆధ్వర్యములో ప్రజలు,యువత,క్రీడాకారుల మధ్య సఖ్యత,ఐక్యతకు శ్రీకారం చుడుతున్నారు అని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను క్రీడాకారులను తయారు చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ఆనాటి సి.ఎం కె.సి.ఆర్ గారిని ఒప్పించి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న 10ఎకరాల విలువైన భూమిని మున్సిపల్ పాలకవర్గం అభ్యర్థన మేరకు క్రీడా స్టేడియంకు కేటాయించడం జరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు.
మౌలిక వసతుల కోసం 10కోట్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని నేటి పాలకులు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల.కరుణశ్రీ,వైస్ చైర్మన్ కర్రేస్వామి,మండల పట్టణ అధ్యక్షులు వనం.రాములు,దిలీప్ రెడ్డి,మాజీ మార్కెట్ ఛైర్మెన్ శ్యామల,సింగిల్ విండో ఛైర్మెన్ జగన్నాథం నాయుడు,చిన్న ఎల్లారెడ్డి,మేకల.ఎల్లయ్య,మజీద్, అఖిల్ ,తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రతి సంవత్సరం ఆటలను,క్రీడాకారులను పెంచుకునే దిశగా కృషిచేస్తున్న నిర్వాహకులకు అభినందనలు )