అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్ తెలుగు/వనపర్త : నిజమైన అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చిన్నంబావి మండల పరిధిలోని చిన్నంబావి గ్రామపంచాయతీలో, వీపానగాండ్ల మండల పరిధిలోని సంపట్రావు పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను ప్రారంభించారు. గ్రామసభల ద్వారా ఆమోదం పొందిన లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిజమైన అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి పథకాలకు అర్హుల జాబితా సిద్ధం చేసి వారికి పథకాల లబ్ది చేకూరుస్తోందన్నారు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చని, పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(Story : అర్హులకు పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం )