నిజాలను నిర్భయంగా వెలికి తీయాలి
బి.వి.ఆర్ ట్రస్ట్ చైర్మన్ బూజల వెంకటేశ్వర్ రెడ్డి
99 టివి ఛానల్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు మల్యాల బాలస్వామి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజలకు తెలియజేయాలని ప్రముఖ అడ్వకేట్,బి.వి.ఆర్ ట్రస్ట్ చైర్మన్ బూజల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.శనివారం
వనపర్తి జిల్లా కేంద్రంలోని బూజల క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా 99 టీవీ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజల మన్ననలు పొందిన 99 టీవీ వాస్తవాలను నిర్మొహమాటంగా ప్రజలకు అందించాలన్నారు.ప్రజా సమస్యల పైన వార్తలను అందిస్తున్న 99టీవీ ని అభినందిస్తున్నామని అన్నారు.2024 సంవత్సరాన్నీ పూర్తి చేసుకొని 2025లో అడుగు పెడుతున్న సందర్భంగా 99టీవీ ప్రేక్షకులకు,జిల్లా ప్రజలకు 99టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వార్త సేకరణలో ముందు బాగాన నిలుస్తున్న 99 టీవీ వనపర్తి జిల్లా ప్రతినిధి నరసింహ రాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మల్యాల బాలస్వామి, ఎన్టీవీ ఆంజనేయులు,బిగ్ టీవీ అరుణ్,రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story : నిజాలను నిర్భయంగా వెలికి తీయాలి)