వినుకొండ పట్టణం టీపీఓగా వెంకటరావమ్మ
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరావమ్మ కి టౌన్ ప్లానింగ్ ఆఫీసరుగా పదోన్నతి లభించింది. ఆమెను తిరిగి వినుకొండ పట్టణంకు టీపీఓగా నియమించారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ టిపిఓగా కూడా వినుకొండ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. (Story : వినుకొండ పట్టణం టీపీఓగా వెంకటరావమ్మ )