ఎల్.ఐ. సి ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ
దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఎల్.ఐ. సి ఆఫీసు లో ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ చెరుకూరి హరనాథ్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో ప్రతి ఎల్ ఐ సి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ కార్పొరేషన్ కు, పాలసీ దారులకు మధ్య ఏజెంట్ వారధిగా ఉంటూ పాలసీ దారులకు మెరుగైన సేవలను అందిస్తున్నారని, ఏజెంట్ వృతి ఎంతో గౌరవం అని కొనియాడారు. అనంతరం గౌరవ సలహాదారులు గాలి రమణ మాట్లాడుతూ. ఏజెంట్స్ ఎల్. ఐ.సి సంస్థకు మూల స్థంభాల ని కొనియాడారు. వినుకొండ బ్రాంచ్ లో పాలసీ దారులకు మెరుగైన సేవలు అందించడానికి ఏజెంట్స్ అందరూ ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆదిరెడ్డి, ఏజెంట్స్ లీడర్స్, ఆఫీసు సిబ్బంది , అత్యధిక సంఖ్యలో ఏజెంట్ లు పాల్గొన్నారు.(Story :ఎల్.ఐ. సి ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవ వేడుకలు)