Homeవార్తలు '8 వసంతాలు' హార్ట్ వార్మింగ్ టీజర్ 1 రిలీజ్

 ‘8 వసంతాలు’ హార్ట్ వార్మింగ్ టీజర్ 1 రిలీజ్

 ‘8 వసంతాలు’ హార్ట్ వార్మింగ్ టీజర్ 1 రిలీజ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం  ఫస్ట్ లుక్ పోస్టర్,  గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి క్రియేట్ చేసింది.

కొత్తగా విడుదలైన టీజర్ విడిపోవడం వల్ల కలిగే బాధలతో వున్న కన్న పసునూరిని అవంతిక ఓదార్చడంతో ప్రారంభమవుతుంది. అతని దుఃఖం లోతును ఆమె అర్థం చేసుకోలేదని చెప్పడంతో హను రెడ్డితో తన ఫస్ట్ లవ్ ని రివిల్ చేస్తోంది. “ఎవరి తుపాన్ లు వారికి వుంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు’ ఈ డైలాగ్ క్యారెక్టర్స్ బ్యాక్ డ్రాప్ ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేసింది. ఫణీంద్ర నర్సెట్టి రైటింగ్ కథనంలో పొయిటిక్ టచ్, రివర్స్ ఫ్లాష్‌బ్యాక్‌తో చేయడం టీజర్‌కు డెప్త్ యాడ్ చేసింది.

అనంతిక సనిల్‌కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది, టీజర్ కన్న పసునూరి, హను రెడ్డి యొక్క కీలక పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. విశ్వనాథ్ రెడ్డి ఛాయాగ్రహణం విజువల్ గా అద్భుతంగా వుంది.    హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఎమోషనల్ డెప్త్ ని కంప్లీట్ చేసింది. ఈ టీజర్ ఎమోషనల్ లేయర్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

నటీనటులు: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story :  ‘8 వసంతాలు’ హార్ట్ వార్మింగ్ టీజర్ 1 రిలీజ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics