రెడ్డి సేవా సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో రెడ్డి సేవా సంఘం నూతనభవణ నిర్మాణానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి తాను ఎల్లవేళల సహకరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామం మాజీ సర్పంచ్ సూర్య చంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసి కొమ్ము వెంకటస్వామి, వెంకటయ్య యాదవ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : రెడ్డి సేవా సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన )