లేబర్ కోడ్ రద్దుకై..ఫిబ్రవరి 5న దేశవ్యాప్త నిరసనలు
పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ )రాష్ట్ర కార్యదర్శి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5వ తేదీన భారత దేశవ్యాప్తంగా కార్మిక నిరసన కార్యక్రమానికి యావత్ కార్మిక వర్గం శ్రీకారం చుట్టాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) నేతృత్వంలో రూపొందించిన 2025 వాల్ క్యాలెండర్ ను సోమవారం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ కాలం నుండి నేటివరకు సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను బిజెపి సర్కార్ నాలుగు కోడ్ లుగా విభజించి 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. దీని ఫలితంగా కోటానుకోట్ల కార్మిక వర్గం అనేక హక్కులకు సంక్షేమాలకు దూరమయ్యే ప్రమాదం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సవరణ చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కనీస వేతనాలను కుదించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసే విధానం అమలు జరుగుతున్నదని దీని పర్యవసరంగా కార్పొరేట్ బహుళ జాతి గుత్త పెట్టుబడిదారులకు భారతదేశం ప్రయోగశాలగా మారనుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పని చేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు 24 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ యూనియన్ నేతలు కార్మికులు గంజి శీను, నరసింహ, దర్గా స్వామి,కుమార్, ఆంజనేయులు,శ్రీకాంత్,శివ, మహేందర్, ప్రవీణ్,బాను,అనిల్,రవి కిషోర్,రహేళమ్మ,భాగ్మమ్మ, చెన్నమ్మ,ప్రమిల తదితరులు పాల్గొన్నారు. (Story : లేబర్ కోడ్ రద్దుకై..ఫిబ్రవరి 5న దేశవ్యాప్త నిరసనలు)