Home వార్తలు తెలంగాణ పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

0

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో పలు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ముందుగా కానాయపల్లి స్టేజి దగ్గర బిఆరెస్ సీనియర్ నాయకులు నక్కల శాంతన్న ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ షాపును సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కానాయపల్లి తండాలో ఇటీవల చనిపోయిన రూప్ల నాయక్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిదంగా కానాయపల్లి గ్రామంలో బైండ్ల లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతురాలికి నివాళ్లు అర్పించారు. అలాగే బిసి సంఘం నాయకులు భీమన్నా నాయుడు తల్లి ఇరుపునూరి అబ్దులామ్మ చనిపోవడంతో కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం కల్పించారు. అలాగే బిఆరెస్ కార్యకర్త జంగిడి రాజు తల్లి గుండెపోటుతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిదంగా ఇటీవల రోడ్ ప్రమాదంలో వడ్డే ఆంజనేయులు కొడుకు కూతురు చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విషయాల్లో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, బిఆరెస్ యూత్ అధ్యక్షులు నెహ్రు, కౌన్సిలర్ నాగన్న,మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, నరోత్తమ్ రెడ్డి, మురళీదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, భరత్ రెడ్డి, శేఖర్ గౌడ్, రవీందర్ గౌడ్, నక్కల శాంతన్న, సాయిలు, కుర్మయ్య, హోటల్ రాజు, బక్క గోవర్ధన్, వడ్డే రాములు, అంజన్న, వెంకటేష్ సాగర్, బాజ గిరన్న, డీలర్ శ్రీను, మురళి, ధనుష్, ఇశ్రాయిల్,నక్కల చిన్న నర్సింహా, కొత్త నర్సింహా, రాములు తదితరులు పాల్గొన్నారు.(Story : పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version