హాస్య మణిహారం చింతామణి నాటకం
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచి లో నూతనంగా కళా పరిషత్ ఆవిర్భవించింది. గుడిలోని దేవుడు రాముడు , తెలుగు వారి గుండెల్లోని రాముడు ఎన్టీఆర్ పేరు కలసి వచ్చేలా శ్రీ తారక రామ కళా పరిషత్ అని నామకరణం చేసి సంక్రాంతికి రెండు రోజులపాటు మహిళలకు రంగవల్లుల పోటీలు , వివిధ ఆటల పోటీలు , బాలలకు డాన్స్ పోటీలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కారుమంచి గ్రామానికే చెందిన ప్రఖ్యాత హాస్యనటుడు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రద్వారా లబ్ధ ప్రతిష్ఠుడైన స్వర్గీయ అర్వపల్లి సుబ్బారావు పేరిట అవార్డును ఏర్పాటు చేసి, నాటకరంగ ప్రముఖుడు బెల్లంకొండ కోటయ్య ను ఎంపిక చేసి అవార్డును ఇచ్చి ఘనంగా సత్కరించారు. గ్రామంలో విద్యను ప్రత్సాహించే విధంగా ‘ మా ఊరి ప్రతిభావంతుడు’ అవార్డును ఏర్పాటు చేసి మొదటిసారిగా కాకినాడలో ప్రొఫసర్ గా పనిచేస్తున్న గ్రామ వాసి డాక్టర్ గడుపూడి చిన పున్నయ్య కు అందజేశారు. రెండురోజుల పాటు జరిగిన వివిధ పోటీల విజేతలకు రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ వారు బహుమతులను అందించారు. రోటరీ క్లబ్ అభ్యక్ష కార్యదర్సులు గుమ్మా శ్రీకాంత రెడ్డి , యేరువ వెంకట నారాయణ , రోటరీ జిల్లా ఎగ్జిక్యూటివ్ అలా శ్రీనివాసరావు తో పాటు గ్రామ పెద్దలు యరమాసు కోటేశ్వరరావు , గోపాలం శివ ప్రసాద్ , మాదాల చిరంజీవి , మన్నం వెంకటేశ్వర్లు , గోరంట్ల చిన అంజయ్య, కోట లింగమ్మ తదితరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు . పరిషత్ బాధ్యులు కూచి రామాంజనేయులు , ముప్పా శ్రీనివాసరావు , లక్ష్మయ్య , వెంకటేశ్వర్లు , చంద్రం , గ్రామ యువకులు కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు . రెండు రోజుల కార్యక్రమాలలో పాల్గొన్న దాదాపు 600 మంది ప్రేక్షకులకు పరిషత్ నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. (Story : హాస్య మణిహారం చింతామణి నాటకం)