మున్సిపాలిటీ చట్టాలను అవహేళన చేస్తున్న
వనపర్తి కమిషనర్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మున్సిపాలిటీ చట్టాలను వనపర్తి కమిషనర్ అవహేళన చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు అన్నారు. సమావేశం మందిరంలోకి ఇతరులను పిలిపించి మాట్లాడించిన
ప్రజావాణిలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా మీరు చర్యలు తీర్చుకోవడం లేదు. ప్రజల సమస్యలు బయటకు తెలుస్తాయని పత్రికా, మీడియా విలేకరులను మున్సిపల్ సమావేశం జరిగే గదిలోకి నిషేధించిన ప్రభుత్వం కౌన్సిలర్ల భర్తలను, కుటుంబ సభ్యులను ఎలా అనుమతిస్తారు అని అన్నారు మున్సిపల్ సమావేశాలలో సభ్యులు అధికారులు తప్ప వేరేవారికి అవకాశం ఉండదు మున్సిపల్ సమావేశంలో కొందరు వ్యక్తులను అనుమతించి వారితో మాట్లాడించడం నేరం కాదా? గతంలో మున్సిపల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కౌన్సిలర్ల భర్తలను ఆమడ దూరంలోనే ఆపేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా కౌన్సిలర్ భర్తలను వారి కుటుంబ వ్యక్తులను అనుమతించి, వారితో తిట్ల పురాణాలు చేయించినదేవరు. ఈ సమావేశానికి బాధ్యులు ఎవరు. అసలు మున్సిపాలిటీ అనేది మురికిపాలిటీ చేసిన క్రమంలో ఈ సమావేశం చూస్తే ఏమని పేరు పెట్టాలో తెలియడం లేదంటున్నారు మేదావులు. వనపర్తి పట్టణానికి సేవలు అందించే మున్సిపాలిటీని , ఈ కౌన్సిల్ మొత్తంలో ఇష్టానుసారంగా ఉపయోగించే కూరగాయల మార్కెట్ లా తయారు చేస్తున్నది ఎవరు? కొందరి అవినీతి అరాచక అడ్డాగా మారుస్తున్నది ఎవరుఅనిఅన్నారు . జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని దీనికి బద్యులైన వారిని శిక్షించాలని, గత కొంతకాలంగా జరుగుతున్న అవినీతిని కూడా అరికట్టాలని వాటిపై విచారణ చేయాలని దానిపై సమగ్రంగా తగు సాక్షాలు అందిస్తామని అన్నారు. (Story : మున్సిపాలిటీ చట్టాలను అవహేళన చేస్తున్న వనపర్తి కమిషనర్)