Home వార్తలు తెలంగాణ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణం

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణం

0

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్

అరెస్ట్ దారుణం

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు నిదర్శనం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్.హరగోపాల్ ప్రశ్నించే గొంతుక అని ప్రజల జీవనవిధానాన్నికి భంగం కలిగించే మైనింగ్ ఆపాలని పోరాడుతున్న ప్రొఫెసర్.హరగోపాల్ గారిని అరెస్టు చేయడం ప్రశ్నించేవారిని అణగదొక్కడమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మేధావులు ఇప్పటికైనా భ్రమలు వీడి ప్రజాపక్షాన నిలబడాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. (Story : పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version