Home వార్తలు తెలంగాణ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న శ్రీరంగాపురం రంగనాయక స్వామివారి ఆలయం

పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న శ్రీరంగాపురం రంగనాయక స్వామివారి ఆలయం

0

పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న శ్రీరంగాపురం రంగనాయక స్వామివారి ఆలయం

 

పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తూ

GO RT NO 296ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు

న్యూస్ తెలుగు/వనపర్తి  : వనపర్తి నియోజకవర్గంలో పేరెన్నిక గన్న శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1కోటి 50 లక్షలు మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు

ఈ నిధుల మంజూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారికి పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ మల్లు రవి గారికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

రంగనాయక స్వామి ఆలయంతో పాటు శ్రీరంగసముద్రం రిజర్వాయర్ ఉన్నందువలన ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు

బోటింగ్ సౌకర్యం, సుందరీ కరణ, లైటింగ్, గార్డెన్స్ నిర్మాణం
కాటేజ్ లో ఏర్పాటు,
రెస్టారెంట్లు ఏర్పాటు,
కాలినడక దారులు లాంటి పలు ఏర్పాట్లు చేయనున్నట్లు MLA పేర్కొన్నారు.(Story : పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న శ్రీరంగాపురం రంగనాయక స్వామివారి ఆలయం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version