Homeవార్తలుబెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్ గెలుపొందిన రైమా సేన్ 'మా కాళి'

బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్ గెలుపొందిన రైమా సేన్ ‘మా కాళి’

బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్ గెలుపొందిన

రైమా సేన్ ‘మా కాళి’

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :  నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్‌హిట్ చిత్రం కార్తికేయ 2 నిర్మాత, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్రిభాషా చిత్రం ‘మా కాళి’ ప్రతిష్టాత్మక జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్  పోలిటికల్ మూవీ అవార్డును గెలుచుకుంది. టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ యెలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.

జనవరి 17, 2025న, మా కాళి దర్శకుడు విజయ్ యెలకంటి నటి రైమా సేన్‌తో కలిసి జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డును అందుకున్నారు.

రైమా సేన్  మాట్లాడుతూ..“మా కాళికి ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని నాకు తెలుసు. ఈ గుర్తింపు మాకు ముఖ్యమైన, సానుకూల మార్పును ప్రేరేపించే కథలని చెప్పే శక్తినిస్తుంది. ఇది మహిళా ప్రధాన చిత్రం కాబట్టి, JIFF నుండి ఈ గుర్తింపు పొందడం మరింత సంతృప్తికరంగా ఉంది.” అన్నారు

దర్శకుడు విజయ్ యెలకంటి మాట్లాడుతూ”మా కాళికి  బెస్ట్  పోలిటికల్ మూవీ  అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది,JIFF ద్వారా ఈ గుర్తింపు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తోంది. మార్పును ప్రేరేపించే చిత్రాలను రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది.”

భారతీయ చరిత్రలో చెరిపివేయబడిన అధ్యాయం ఆధారంగా, మా కాళి శక్తివంతమైన కథ, ప్రభావవంతమైన పెర్ఫార్మెన్స్ లతో బెంగాల్‌లోని అన్‌టోల్డ్ చాప్టర్స్ ని ప్రజెంట్ చేస్తోంది. కలకత్తా, నోఖాలీలో జరిగిన క్రూరమైన నరమేధ రక్తపాత సత్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశ విభజనకు దారితీసిన డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఉన్న సత్యాన్ని ముందుకు తీసుకురావాలనేది మా కాళి లక్ష్యం.

మా కాళి సోషియో-పోలిటికల్ సబ్జెక్ట్ ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1946 నుండి నేటి బంగ్లాదేశ్ వరకు హిందువులను పీడించడం, బెంగాల్ మతపరమైన అల్లకల్లోలాలను చిత్రీకరిస్తూ, మా కాళి Citizen Amendment Act (CAA)  ప్రాముఖ్యతను, దాని అమలు యొక్క అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.

విజయ్ యెలకంటి రచన, దర్శకత్వం వహించిన మా కాళిని TG విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మించారు, కార్తికేయ 2 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సమర్పిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హిందీలో చిత్రీకరించబడింది,  బెంగాలీ, తెలుగులో 2025లో థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రైమా సేన్, అభిషేక్ సింగ్
సిబ్బంది:
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్
రచన & దర్శకత్వం: విజయ్ యెలకంటి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
చీఫ్ కో-ఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: అనురాగ్ హల్డర్
D.O.P: ఆచార్య వేణు
ఎడిటర్: కిరణ్ గంటి
డైలాగ్స్: అమర్నాథ్ ఝా
ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె
ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రూషిన్ దలాల్ & కైజాద్ గెర్డా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గురు శరణ్ యండమూరి
కో డైరెక్టర్: శ్రీ నివాస్ డి
లిరిసిస్ట్: కునాల్ వర్మ
యాక్షన్: వింగ్ చున్ అంజి
కాస్ట్యూమ్స్: ఆశా గొందూరు
సౌండ్ డిజైనర్: J.R. ఇతిరాజ్
ఆర్ట్: అభిష్ట
మార్కెటింగ్: హౌస్‌ఫుల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మార్కెటింగ్ హెడ్ (PMF): తిరుమలశెట్టి వెంకటేష్ (Story : బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్ గెలుపొందిన రైమా సేన్ ‘మా కాళి’)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics