రెవెన్యూ డివిజన్ గా పెబ్బేరు మున్సిపాలిటీ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మరి కొద్దిరోజుల్లో పెబ్బేరు మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ గా మారనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. దానికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం జీవోను విడుదల చేయనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం ఆయన శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో రూ.70 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.18 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కంబాళాపూర్, షేరుపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్రీరంగాపూర్ మండలకేంద్రం నుంచి రంగవరం నుంచి ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులు, కేజీబీవీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీలో ఇటీవల ప్రారంభమైన రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పట్టణంలోని 1వ వార్డులో ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పీహెచ్సీ ముందు కొత్తగా నిర్మించిన షాపింగు కాంప్లెక్స్ ను, సెంట్రల్ లైటింగ్ సిస్టం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను, సుభాష్ చౌక్ నుండి పీజేపీ కెనాల్ వరకు రోడ్డు, డివైబర్ల నిర్మాణ పనులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 26 గణతంత్ర దినోత్సవ నాటి నుంచి మరో నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. త్వరలోనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా తులం బంగారం, మహిళలకు రూ.2500 భృతి , రూ. 4000 పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు. త్వరలో తాటిపాముల గ్రామ శివారులోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ రాబోతుందని, వనపర్తి నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్, పెబ్బేరు పట్టణంలోని పీహెచ్సీ స్థానంలో 30 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి ఈ నెల 23న హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కరుణశ్రీ, వైస్ ఛైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు అక్కమ్మ, పార్వతి, సుమతి, పద్మ, ఎల్లస్వామి, చిన్నఎల్లా రెడ్డి, పెబ్బేరు ఏఎంసీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ప్రమోదిని రెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు రాములు యాదవ్, శ్రీహరి రాజు, నరేందర్ రెడ్డి, పార్వతమ్మ, వెంకటయ్య, బీరం రాజశేఖర్ రెడ్డి, వాసుదేవారెడ్డి, దయాకర్ రెడ్డి, రంజిత్ కుమార్, దిలిప్ కుమార్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. (Story :రెవెన్యూ డివిజన్ గా పెబ్బేరు మున్సిపాలిటీ)