వాలీబాల్ ఆర్చరీ క్రీడలను ప్రారంభిoచిన జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/చింతూరు : మండల కేంద్రంలో శనివారం జేకే సిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్, ఆర్చరీ క్రీడలను జమాల్ ఖాన్ శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించాలని ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ దురలవాట్లకు దుర్ వ్యసనాలకు కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని మితిమీరిన అలవాట్లు ఆరోగ్యానికి కీడు చేస్తాయని క్రమశిక్షణతో వ్యాయామం చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ఆరోగ్యంతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలను కాపాడుకునే దిశగా యువత నడవాలన్నారు. దేశానికి వెన్నుముకగా యువత ఉండాలని భావితరాలు నేటి యువతపైనే ఆధారపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు రియాజ్, షాజహాన్, విక్కీ, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.(Story : వాలీబాల్ ఆర్చరీ క్రీడలను ప్రారంభిoచిన జమాల్ ఖాన్ )