రక్తదానం చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాల్ని కాపాడడమే
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేపు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్
న్యూస్ తెలుగు / వినుకొండ : సమాజంలో ప్రతిఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడమంటే ఒక వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడమే అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఒక్క చుక్క రక్తం ఒక్కో జీవితానికి కొత్త ఆశనే అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకే అన్నిదానాల్లో కంటే రక్తదానం గొప్పది అంటారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్‌లో నిర్వహించబోతున్న లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గోవాలని కోరారు. శుక్రవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆ మహనీయుడికి సరైన నివాళి అర్పించినట్లు అవు తుందని అన్నారు. తద్వారా ఎన్టీఆర్ స్ఫూర్తిని కూడా కొనసాగించినట్లు అవుతుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ప్రమాదాలకు గురైన వారికి రక్తం అత్యంత అవసరమని ఇలాంటి క్యాంపుల్లో రక్తదానం చేయడం ద్వారా అలాంటి వారిని ఆదుకోవచ్చన్నారు. మానవతా మానవతా దృక్పథాన్ని ప్రదర్శించేందుకు అందరికీ ఇదో మంచి అవకాశం అన్నారు. (Story : రక్తదానం చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాల్ని కాపాడడమే)