రాష్ట్ర విద్యార్థి యువసేన 3 వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర విద్యార్థి యువసేన 3 వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులు సంపెంగుల రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం పోరాడుతున్న మమల్ని ప్రోత్సహిస్తూ ఇంకా ముందు రోజులో విద్యార్థులకు మంచి చేసే విధంగా గా పోరాడాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం అయినా ఎప్పుడు ముందు వుంటాను అంటూ మమల్ని ప్రోత్సహిస్తున్న చీఫ్ విప్ కి ధన్యవాదాలు తెలుపుతూ, 28 జరగబోవు ఈ వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని, కోరుకుంటున్నామని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో మాజీ విద్యార్థి నాయకులు సాగర్ బాబు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నర్రా కిషోర్,వీరగంధం ప్రశాంత్, మెడ ఏసుబాబు, వెలిగండ్ల కోటేశ్వరరావు, ఎం. ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. (Story : రాష్ట్ర విద్యార్థి యువసేన 3 వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ)